ఈ క్రమంలోనే కొంతమంది కొత్త ఆటగాల్లు మళ్లీ జట్టులోకి వచ్చారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్ లో ఫార్మాట్లో చోటు దక్కించుకోలేకపోతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ జట్టులోకి రావడం గమనార్హం. అయితే ఈ సిరీస్ లోని మొదటి రెండు మ్యాచ్లలో కూడా కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు అని చెప్పాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఈ సిరీస్ లో అటు అశ్విన్ కు ఛాన్స్ ఇవ్వడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
వన్డే వరల్డ్ కప్ లో అతనికి ఛాన్స్ ఇవ్వాలి అని ఉద్దేశంతోనే సెలెక్టర్లు ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసినట్లు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తూ వేస్తూ ఉన్నారు. బీసీసీఐ సెలెక్టర్లు ఇలాంటి సంకేతాలు ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. అయితే అశ్విన్ ప్రపంచ కప్ టీంలోకి రావడం అనేది అంత సులువైన విషయం కాదు. ప్రపంచం జట్టులోకి రావాలంటే ఆస్ట్రేలియా సిరీస్ లో మెరుగైన ప్రదర్శన చేసి చూపించాలి. అయితే మొన్నటికి మొన్న ముగిసిన ఆసియా కప్లో అశ్విన్ కు చోటు దక్కలేదు. కాగా అశ్విన్ ఆఫ్ స్పిన్నర్ కాగా.. ఎడమ చేతి వాడటం బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని సార్లు ఏకంగా బ్యాట్ తో కూడా ఆకట్టుకుంటాడు అని చెప్పాలి. అందరూ ఊహించినట్లుగా నిజంగానే అతనికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి