గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియాలోకి ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ఐపీఎల్ లో సత్తా చాటి అతి తక్కువ సమయంలోనే భారత జట్టులో చోటు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇక కొంతమంది ప్లేయర్స్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటే కొంతమంది రెండు మూడు మ్యాచ్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అయితే ఇలా ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ వస్తున్న ఒక్క ప్లేయర్కు మాత్రం గత కొంతకాలం నుంచి వివక్ష ఎదురవుతుంది. సెలెక్టర్లు అతన్ని తరచూ పక్కన పెడుతూనే వస్తున్నారు అని చెప్పాలి. ఆ ఆటగాడు ఎవరో కాదు సంజు శాంసన్.


 అతను వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్. అతనిలో మంచి టాలెంట్ కూడా ఉంది. కానీ ఎందుకో సెలెక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవట్లేదు. యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇస్తున్నారు. కానీ ఇక భారత జట్టు తరుపున ఆడిన అనుభవం ఉన్న సంజూని మాత్రం తరచూ పక్కన పెడుతూనే ఉన్నారు. అప్పుడప్పుడు స్టాండ్ బై ప్లేయర్గా ఎంపిక చేసినప్పటికీ ఇక అవకాశాలు ఇవ్వకుండా బెంచ్ కే పరిమితం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. జట్టు ఎంపికలో సంజూ సంజు శాంసన్ను ప్రతిసారి విస్మరిస్తూ ఉండడం పై అటు అభిమానులు కూడా తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దేశవ్యాప్తంగా సంజు గురించి నిరసనలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే వన్డే వరల్డ్ కప్ తో పాటు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ లో కూడా సంజు శాంసన్ కు చోటు తగ్గకపోవడంపై మాజీ స్పిన్నర్ హార్భజన్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ అందుబాటులో ఉన్నారు. అందుకే సంజు శాంసన్  ను ఎంపిక చేయలేదు అని అనుకుంటున్నాను అంటూ అభిప్రాయపడ్డాడు హర్భజన్. ఇక నాలుగు ఐదు స్థానాలలో బెస్ట్ ఎవరు అంటే తాను రాహుల్ వైపే ముగ్గు చూపుతాను అంటూ బజ్జీ చెప్పుకొచ్చాడు. ఇక సంజూ ఛాన్స్ కోసం ఓపికగా వేచి చూడాలి అంటూ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: