ఇకపోతే నేడు వరల్డ్ కప్ లో భాగంగా మరో ఆసక్తికరమైన పోరు జరగబోతుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు మూడు స్థానాలలో కొనసాగుతున్న సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ మధ్య ఈ ఆసక్తికర పోరు ఉండబోతుంది. ఈ సమవుజ్జీల పోరు ఎంతో ఆసక్తి రేపుతుంది అని చెప్పాలి. అయితే ఈ రెండు జట్లు కూడా ఆడిన ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్ నమోదు చేస్తూ ఉన్నాయి. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఎంసీఏ మైదానం లో ఈ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మైదానం బ్యాటింగ్కు మరి అనుకూలమైనదేమీ కాదు. స్పిన్నర్లకు ఎక్కువగా సహకారం ఉంటుంది.
అయితే ఇక ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే 12 పాయింట్లతో దాదాపు ఆ జట్టు సెమి ఫైనల్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీ మొత్తంలో ఈ రెండు టీమ్స్ కూడా చాలా వరకు మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాయి. అయితే 2019 వరల్డ్ కప్ లో జరిగిన మ్యాచ్ తర్వాత ఇప్పుడు వరకు ఈ రెండు టీమ్స్ ఒక్కసారి కూడా వన్డే మ్యాచ్లో తలపడలేదు అని చెప్పాలి. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే వరల్డ్ కప్ లో మ్యాచ్ జరగబోతుంది. దీంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి