ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. సెమీఫైనల్కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఊహకుందని విధంగానే మారిపోయింది. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అందరిలో సెమి ఫైనల్ కు వెళ్ళబోయే నాలుగు టీమ్స్ పై ఒక అంచనా ఉండేది. ఇక వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత ఆ అంచనా మరోలా మారింది. ఇక ఇప్పుడు సెమీఫైనల్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇక ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్ లో కొనసాగిన టీమ్స్ వరుస ఓవటములతో సతమతమవుతున్నాయి.


 అదే సమయంలో ఇక వరుస ఓటములతో పాయింట్లు పట్టికలో దిగువన ఉన్న టీమ్స్ మాత్రం ఇప్పుడు భారీ విజయాలు సాధిస్తూ సెమీఫైనల్ బెర్త్ ను కన్ఫార్మ్ చేసుకోవడానికి ముందుకు దూసుకు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఊహించడం విశ్లేషకులకు సైతం సాధ్యం కానీ విధంగా మారిపోయింది. అయితే వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగబోతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కి ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. కాగా ఈ వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ఎంత విజయవంతమైన ప్రస్థానం కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్లకు గాను ఆరు గెలిచిన టీమ్ ఇండియా ఇక శ్రీలంకతో జరగబోయే ఏడవ మ్యాచ్ లో గెలిస్తే అధికారికంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టినట్లే అవుతుంది. అయితే వాంఖడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో పరుగుల వరద పారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు శ్రీలంక ఆరు మ్యాచ్లలో రెండు నెగ్గి పీకల్లోతు కష్టాల్లో ఉంది శ్రీలంక. దాదాపు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. అయితే స్థాయికి తగ్గట్లుగా ఆడితే భారత్ సులువుగానే శ్రీలంకపై విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc