ఇప్పటికి శ్రీలంక టీం వరుస పరాజయాలతో సతమతమవుతుంది. ఇలాంటి సమయంలో ఇక పటిష్టమైన టీమ్ ఇండియాతో డూ ఆర్ డ్రైవ్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలి అంటే తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మ్యాచ్లో శ్రీలంక జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 55 పరుగులు మాత్రమే చేసి చాప చుట్టేసింది. దీంతోభారత జట్టు 302 పరుగుల తేడాతో శ్రీలంక పై ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లి సెమీఫైనల్ కు కూడా క్వాలిఫై అయ్యింది.
శ్రీలంక దారుణ ఓటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి. కాగా 302 రన్స్ తేడాతో భారత్ చేతిలో ఓడిపోవడంపై శ్రీలంక జట్టు కెప్టెన్ కుషాల్ మెండిస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమి నన్ను ఎంతగానో బాధించింది. మా జట్టు నేను మెరుగ్గా ఆడలేదు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో బంతి అంత స్ప్రింగ్ అవుతుందని అస్సలు ఊహించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా వేశాను. కానీ అలా జరగలేదు. అయితే ఈ విజయంలో టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కే క్రెడిట్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు కుశాల్ మెండిస్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి