టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగడమే కాదు.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు తన బ్యాటింగ్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన రోహిత్ శర్మ.. ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా ఒకవైపు కెప్టెన్సీ ఒత్తిడిని మోస్తూనే ఇంకోవైపు ఆటగాడిగా కూడా రాణిస్తూ ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న రోహిత్ టీమిండియాకు.. ప్రతి మ్యాచ్లో కూడా శుభారాంబాలు అందించడంలో సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి.


 ఏకంగా ఓపెనర్గా బరిలోకి దిగి ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు రోహిత్ శర్మ. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇక మంచి ఆరంభాలు రావడంతో మిగతా ఆటగాళ్లు ఇక ఒత్తిడి ధర చేరకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నారు అని చెప్పాలి. కాగా వరల్డ్ కప్ లో టీం ఇండియా ప్రస్థానం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడితే ఒక్క ఓటమి కూడా లేకుండా అన్ని మ్యాచ్లలో కూడా విజయం సాధించింది భారత జట్టు. కాగా రోహిత్ శర్మ ఆట తీరుపై పాకిస్తాన్ వసీం అక్రమ్ ప్రశంసలు వర్షం కురిపించాడు.


 అందరిలా కాదు రోహిత్ మరో రకం అంటూ వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. రోహిత్ లాగా ఎవరూ కూడా బ్యాటింగ్ చేయలేరు. మనం ఎప్పుడూ కూడా విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్, జోరూట్, బాబర్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాం. కానీ రోహిత్ వీరందరితో పోల్చి చూస్తే వేరే రకం. అతను ఆడుతుంటే బ్యాటింగ్ చేయడం ఇంత సులభమా అని అనిపిస్తూ ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా బౌలర్ ఎవరైనా కూడా అద్భుతమైన షాట్లు కొట్టగలడు. అందుకే అతనికి బౌలింగ్ చేయాలంటే ప్రత్యర్ధులు భయపడిపోతూ ఉంటారు అంటూ పాక్ మాజీ ప్రశంసించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: