ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ వేయికళ్ళతో ఎదురు చూస్తున్న  వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేడు జరగబోతుంది. మరికొన్ని గంటల్లో ఈ మహాసంగ్రామం ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక విశ్వవిజేతగా నిలిచేందుకు అటు ఒక్క అడుగు దూరంలో ఉంది టీమ్ ఇండియా. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించి ఫైనల్లో విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ అందుకోవాలని.. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. 140 కోట్ల మంది భారతీయులు ఇక టీమ్ ఇండియా పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఎన్నో ఆసక్తికర విషయాలు తెరమీదకి వస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య గత గణంకాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.



 అదే సమయంలో ఇక టీమ్ ఇండియాదే వరల్డ్ కప్ అంటూ గత కొంతకాలం నుంచి ఎన్నో రకాల వినూత్నమైన సెంటిమెంట్లు తెరమీదకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఫైనల్ మ్యాచ్ కి ముందు భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్లు రోహిత్, కమిన్స్ అహ్మదాబాద్ లోని ప్రఖ్యాత అదాలజ్ స్టెప్ వెల్ వద్ద టోపీ తో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ట్రోఫీకి కుడివైపు రోహిత్ శర్మ ఉన్నాడు. దీంతో వరల్డ్ కప్ టీమిండియాదే అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే భారత ఫాన్స్ ఇలా  ఫిక్స్ అవ్వడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. గత మూడు వరల్డ్ కప్ టోర్నీలలో కూడా ట్రోఫీకి కుడివైపు ఉన్న కెప్టెన్లే తమ జట్టుని విజేతగా నిలిపారు.


 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు ట్రోఫీతో కెప్టెన్లు ఫోటోలు దిగినప్పుడు భారత సారథి ధోని కుడివైపుకు నిలబడి ఉన్నాడు. ఇక అప్పుడు టీమిండియా ప్రపంచకప్ గెలుచుకుంది. 2015 ప్రపంచ కప్ లో అచ్చం ఇలాగే ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చేటప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్న మైఖేల్ క్లార్క్ ఫోటోలలో ట్రోఫీకి కుడివైపే నిలబడ్డాడు. దీంతో ఇక ఆ సమయంలో కూడా ఆస్ట్రేలియా ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. ఇక 2019 వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ట్రోఫీకి కుడివైపే ఉండి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఇక 2019లో ఇంగ్లీష్ జట్టు టైటిల్ ఎగరేసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కూడా కుడివైపే ఉండడంతో భారత జట్టు కప్పు కొడుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: