ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ నుంచే పరుగుల ప్రవాహం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక లీగ్ దశ నుంచి అన్ని టీమ్స్ కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీల మోత మోగించారు. ఈ క్రమంలోనే ఈ సెంచరీలతో ఈ వరల్డ్ కప్ అరుదైన రికార్డు సృష్టించింది. 48 ఏళ్ళ వరల్డ్ కప్ హిస్టరీలో.. అత్యధిక సెంచరీలు నమోదైన ఎడిషన్ గా 2023 వన్డే వరల్డ్ కప్ ఎడిషన్ నిలిచింది అని చెప్పాలి.


 ఇక ఇటీవలే జరిగిన సెమీఫైనల్ పోరులోనూ ఇక అన్ని జట్ల ఆటగాళ్లు సెంచరీలు చేసి అదరగొట్టారు. అయితే ఇక ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో మరోసారి శతకాలు మోత మోగబోతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఈ ఇరు ఎట్లు పటిష్టంగా ఉండడంతో.. రెండు జట్ల మధ్య హోరా హోరూ పోరు జరగడం ఖాయంగానే కనిపిస్తుంది. ఎన్నో సెంచరీలు కూడా నమోదు అవుతాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్ లో సెంచరీ బాదిన ఆటగాళ్లు ఎవరు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఆ వివరాలు చూసుకుంటే.. వరల్డ్ కప్ 2007 ఫైనల్స్ లో శ్రీలంక పై గిల్ క్రిస్ట్ 149 పరుగులతో సెంచరీ తో కదం తొక్కాడు.. ఇక 2003లో వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాపై రికీ పాంటింగ్ 140 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. 1979 లో ఇంగ్లాండ్ పై రిచార్డ్స్ 138 పరుగులు చేసి శతకం సాధించాడు. 1996లో ఆస్ట్రేలియాపై అరవింద ది సిల్వ 107 పరుగులతో సెంచరీ తో కదం తొక్కాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా పై శ్రీలంక లెజెండ్ జయవర్ధనే 103 పరుగులతో శతకం సాధించాడు. మరి ఈరోజు ఫైనల్ లో ఎవరు సెంచరీ చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc