అయితే జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి వాళ్లకి ఇదే చివరి వరల్డ్ కప్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు వరల్డ్ కప్ గెలిస్తే వారికి మంచి వీడ్కోలు లభిస్తుందని అందరూ ఊహించినప్పటికీ జరిగింది మాత్రం మరొకటి. అయితే ఇక అన్ని మ్యాచ్లలో కూడా అదరగొట్టిన టీమిండియా అటు ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఎందుకో ఆస్ట్రేలియాకు సరైన పోటీ ఇవ్వడంలో విఫలమైనట్లే కనిపించింది. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమిపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో తాము విజయానికి అవసరమైనంత పరుగులు చేయలేదు అంటూ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇంకా 20 నుంచి 30 పరుగులు చేసి ఉంటే బాగుండేది అంటూ తెలిపాడు. ఇక కేఎల్ రాహుల్, కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 280 వరకు స్కోర్ చేయాలనుకున్నాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడంతో చివరికి అది సాధ్యం కాలేదు. ట్రావిస్ హెడ్, లభూషణ్ మా నుండి విజయాన్ని దూరం చేశారు. వారిద్దరికీ క్రెడిట్ ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు. లైట్ల కింద బ్యాటింగ్ చేయడంతో వాళ్లకి కాస్త ఈజీగా అయిపోయింది అంటూ రోహిత్ తెలిపారు. కాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు అనే విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి