ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టైటిల్ గెలవడానికి.. చివరి అడుగులో బోల్తా పడింది భారత జట్టు. దీంతో వరల్డ్ కప్ టైటిల్ గెలవాలి అన్న కళ అందరికీ కలగానే మిగిలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టు ఫైనల్లో ఓడిపోవడానికి.. అటు అభిమానులు అందరూ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇక 2011 తర్వాత మొదటిసారి అటు భారత జట్టుకు టైటిల్ గెలిచేందుకు అవకాశం రావడంతో.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక టీమిండియా కు మద్దతు పలికారు. ఎట్టి పరిస్థితుల్లో వరల్డ్ కప్ గెలవాలని కోరుకున్నారు. కానీ చివరికి భారత్ ఓటమి పాలు కావడంతో ఈ విషయాన్ని ఇప్పటికీ జీవించుకోలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే ఏకంగా భారత జట్టు ఫైనల్ లో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఒక అభిమాని గుండె ఆగింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి తిరుపతి మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ యాదవ్ భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలని ఎంతగానో కోరుకున్నాడు. కానీ టీమిండియా ఓడిపోవడంతో అతను ఎంతగానో మనస్థాపానికి గురయ్యాడు. ఇక రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ కావడంతో ఇది చూసి కుంగిపోయాడు. చివరికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి