ఈ క్రమంలోనే ఇప్పటికే వేల రికార్డులను సాధించి తన పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోయేలా చేసిన విరాట్ కోహ్లీ.. ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీ లో కూడా విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఫామ్ కనబరిచాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా మూడు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అంతేకాదు ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగుల వీరుడు గా కూడా విరాట్ కోహ్లీ రికార్డర్ సృష్టించాడు అని చెప్పాలి. ఇలా ప్రతి మ్యాచ్ లో కూడా జట్టు విజయం కోసం అహర్నిశలు శ్రమించాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే తన ఫామ్ ముందు ఎన్నో రికార్డులు కూడా దాసోహం అయిపోయాయి.
అయితే ఇక వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేయడమే కాదు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును కూడా సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్న ప్లేయర్గా నిలిచాడు. ఇప్పటివరకు 157 సిరీస్ లలో కోహ్లీ 21 అవార్డులను అందుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ తన కెరీర్లో 20 సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. అయితే ఈ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేయడంతో ఇక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అతనికి వరించింది అన్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోవడంతో ఇక వరల్డ్ కప్ టైటిల్ గెలవాలనే కల కలగానే మిగిలిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి