ఇటీవల నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో అటు ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. అప్పటివరకు వరుస విజయాలతో ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్థానం కొనసాగించిన టీమిండియా మాత్రం.. ఏకంగా సొంత గడ్డమీద జరిగిన వరల్డ్ కప్ ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు సరైన పోటీ ఇవ్వలేక తడబడింది అని చెప్పాలి.


 అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఓటమితో అటు 140 కోట్ల మంది భారతీయులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇప్పటికీ ఈ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఇంకా ఈ మ్యాచ్ లో ఆటగాళ్ల ప్రదర్శన గురించి చర్చ తెరమీదకి వస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో అటు భారత స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఎంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో ఇక అతను క్రీజులో పాతుకు పోయి నెమ్మదిగా పరుగులు చేస్తూ ముందుకు సాగాడు.


 టెస్ట్ ఫార్మాట్లో లాగా 107 బంతుల్లో 66 పరుగులు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే అతని బ్యాటింగ్ పై మ్యాచ్ అనంతరం విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ స్పిన్ బాగా ఆడతాడు. కానీ ఆ ఇన్నింగ్స్ లో స్ట్రైక్ రొటేట్ చేయలేదు. బహుశా అతను ఇతర బ్యాట్స్మెన్లను నమ్మలేదేమో. 250 పరుగుల తర్వాత చూద్దాం అనుకుని ఉంటాడు. కానీ ఆ తర్వాత మరింత కష్టంగా మారిపోయింది అంటూ మిస్బ ఉల్ హక్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: