కానీ ఊహించని రీతిలో ఫైనల్ మ్యాచ్లో టీమిండియాను దెబ్బ కొట్టింది ఆస్ట్రేలియా. అద్భుతంగా రానిస్తుంది అనుకున్న టీమిండియా తడబడింది. దీంతో ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు.. అటు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఫైనల్ లో ఓడించి నిరాశ మిగిల్చిన ఆస్ట్రేలియా తో ఇక ఇప్పుడు సొంత గడ్డమీద టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. నేటి నుంచి ఈ టి20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్ విశాఖ వేదికగా జరుగుతుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్లో దెబ్బ కొట్టిన ఆస్ట్రేలియాను ఇప్పుడు టి20 సిరీస్ లో ఓడించి ద్వైపాక్షిక సిరీస్ కైవసం చేసుకుని ఇక ఎదురుదెబ్బ కొట్టాలని టీమిడియా భావిస్తూ ఉంది. ఈ టి20 సిరీస్ లో భాగంగా సీనియర్ క్రికెటర్లు అందరికీ కూడా విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. దీంతో ఇక సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగిపోతుంది. సూర్య కుమార్కు డిప్యూటీగా రుతురాజ్ వ్యవహరించబోతున్నాడు. ఇక ఎంతోమంది యంగ్ ప్లేయర్లు కూడా భారత జట్టులో చోటు సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి