మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయి నిరాశలో ఉన్న భారత జట్టు.. ఇక ఇప్పుడు ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా తోనే సొంత గడ్డపై టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. టి20 సిరీస్ లో భాగంగా శుభారంభం చేసింది టీమిండియా. విశాఖ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ లో ఉత్కంఠ భరితమైన పోరులో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. వరల్డ్ కప్ తర్వాత సీనియర్లు అందరికీ కూడా విశ్రాంతి ఇవ్వడంతో.. సూర్య కుమార్ యాదవ్ సారధ్యంలో యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా ఆస్ట్రేలియాతో తలబడుతుంది.



 అయితే ఇలా మొదటి మ్యాచ్ లోనే శుభారంభం చేసిన టీమిండియా.. ఆ తర్వాత కూడా అదే జోరుని కొనసాగించాలని భావిస్తుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు రెండో టి20 మ్యాచ్ లో గెలవాలనే పట్టుదలతో ఉంది అని చెప్పాలి. కాగా నేడు ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య రెండో టి20 మ్యాచ్ జరగబోతుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ ఉండబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక నేడు ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోయే.. ఈ టి20 మ్యాచ్ జరుగుతుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.


 ఎందుకంటే ఈ మ్యాచ్ కి వర్షపు ముప్పు ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిన్నటి నుంచి స్టేడియంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇక ఈరోజు కూడా వర్షం పడే అవకాశాలు 25% ఉండడంతో ఇక అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మ్యాచ్ సమయానికి వర్షం ఉండకపోవచ్చు. చెదురు మధురు  జల్లులు పడినప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి. ఇకపోతే అటు టీమిండియాలో యంగ్ ప్లేయర్స్ ఉంటే అటు వరల్డ్ కప్ లో ఆడిన సీనియర్ ప్లేయర్స్ ఇక ఇప్పుడు భారత జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో కూడా కొనసాగుతూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: