మొన్నటికి మొన్న ఇండియా వేదికగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా.. అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు.. టైటిల్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఒక ఓటమి కూడా లేకుండా ఫైనల్ వరకు దూసుకు వచ్చిన భారత జట్టును.. ఏకంగా సొంత గడ్డమీదనే కోలుకోలేని దెబ్బకొట్టి టైటిల్ ఎగరేసుకుపోయింది కంగారులా టీమ్. ఏకంగా వన్డే ఫార్మట్ లో ఆరవసారి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ ముగిసిన వెంటనే కేవలం రోజుల వ్యవధిలోనే సొంత గడ్డపై అటు టీమ్ ఇండియాతో టి20 సిరీస్ ఆడుతుంది ఆస్ట్రేలియా జట్టు.


 అయితే దాదాపుగా అటు వరల్డ్ కప్ ఆడిన జట్టులోని సభ్యులను ఇప్పుడు టి20 సిరీస్ లో కూడా ఆడుతూ ఉండడం గమనార్హం. అటు భారత జట్టులో మాత్రం సీనియర్ ప్లేయర్లందరికీ కూడా విశ్రాంతి ప్రకటించడంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్స్ ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతూ ఉన్నారు. అయితే అటు వన్డే వరల్డ్ కప్ లో అదరగొట్టిన ఆస్ట్రేలియా టీం 20 సిరీస్ లో మాత్రం చెత్త ప్రదర్శన చేస్తుంది. ఏకంగా కుర్రాళ్ల చేతుల్లో ఓడిపోతుంది. వరుసగా రెండు టీ20 మ్యాచ్లలో ఓడిపోయింది. అయితే మూడో మ్యాచ్లో మాత్రం వీరోచత పోరాటం చేసి విజయం సాధించింది.


 సిరీస్ లో అటు ఆస్ట్రేలియా పేలవ ప్రదర్శన పై విమర్శలు వస్తున్నవే ళ ఇదే విషయంపై స్పందించాడు ఆస్ట్రేలియా పూర్తిస్థాయి కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇటీవల  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వన్డే వరల్డ్ కప్ ముగిసిన రెండు రోజులకే మరో సిరీస్ పెడితే ఆడటం అంత సులువైన విషయం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లేమి రోబోలు కాదు.. మనుషులే.. వరల్డ్ కప్ లో అంతలా ఆడిన తర్వాత మళ్లీ 100% ఇవ్వడం అంత సులువైన పని కాదు. యువ ఆటగాళ్లకు ఇది ఒక మంచి అనుభవం అంటూ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: