
ఇక అతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు ఎక్కడ బంతి వేయాలో కూడా తెలియక బౌలర్లు తికమక పడేవారు. ఎందుకంటే మైదానం నలువైపులా షాట్లు ఆడే ఎబి డివిలియర్స్ ప్రతి బంతిని కూడా బౌండరీకీ తరలించడంలో సక్సెస్ అయ్యేవాడు. అయితే అటు ఐపిఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఎన్నో ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించి.. ఇక భారత క్రికెట్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక విరాట్ కోహ్లీకి ఎబిడి ఎంతో మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అయితే బెంగళూరు జట్టులోకి రావడానికి ముందు ఢిల్లీ టీంలో ఉండేవాడు డివిలియర్స్.
కాగా ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో ఢిల్లీ టీం తనకు ఇచ్చిన మాట తప్పింది అంటూ తెలిపాడు ఏబి డివిలియర్స్. 2008 నుంచి 2010 వరకు మూడేళ్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్ కి ఆడాను. అయితే 2010లో ఢిల్లీ యాజమాన్యం మీటింగ్ పెట్టి మరి తనను రిటైన్ చేసుకున్నట్లు చెప్పింది. కానీ కొన్ని రోజులకే నన్ను వేలంలోకి వదిలేసింది. ఆ సమయంలో ఎంతగానో బాధపడ్డాను.. ఇక వేలంలో కూడా ఎంతగానో టెన్షన్ పడ్డాను అంటూ తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు ఏబిడి.