ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన 2023 వన్డే వరల్డ్ కప్ సమరం ముగిసింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి కూడా 2024 t20 వరల్డ్ కప్ పైనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా సిద్ధం అయిపోతున్నాయ్. కాగా 2022 t20 ప్రపంచ కప్ లో మొత్తం 16 జట్లు పోటీ పడితే ఇక 2024 t20 వరల్డ్ కప్ లో మాత్రం ఏకంగా 20 టీమ్స్ ప్రపంచకప్ ట్రోఫీ కోసం పోటీ పడబోతున్నాయి అని చెప్పాలి. యూఎస్, వెస్టిండీస్ జట్లు టి20 ప్రపంచ కప్ కీ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఆయా దేశాలలో మొదలుపెట్టారు అని చెప్పాలి.


 ఇక వచ్చే ఏడాది జరగబోయే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే 20 జట్ల వివరాలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలో 12 టీమ్స్ నేరుగా అర్హత సాధించాయి. గత టి20 ప్రపంచ కప్ లో టాప్ 8లో నిలిచిన టీమ్స్ తో పాటువరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్, వెస్టిండీస్ లో కలుపుకొని మొత్తం పది టీమ్స్ నేరుగా అర్హత సాధించగా.. టి20 ర్యాంకింగ్స్ లో 9, 10 స్థానాల్లో నిలిచిన ఆప్గనిస్తాన్ బంగ్లాదేశ్ లు కూడా నేరుగా అర్హత సాధించగలిగాయి. మిగతా జట్లు మాత్రం వరల్డ్ కప్ లో చోటు కోసం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి.



ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్లో పాల్గొనబోయే టి20 వరల్డ్ కప్ లో 20 జట్లను నాలుగు గ్రూపుల విభజిస్తారు. ఒక్క గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్ లోకి ప్రవేశిస్తాయి. అక్కడ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు  ఈ గ్రూపులో టాప్ 2 లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్కు చేరుకుంటాయ్. ఇక సెమి ఫైనల్లో విజేతలుగా నిలిచిన టీమ్స్ ఫైనల్ లో కప్పు కోసం పోటీ పడతాయి.


 కాగా టీ20 వరల్డ్ కప్ ఆడబోయే 20 టీమ్స్ ఇవే :

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెనడా, నేపాల్‌, ఒమన్‌, పపువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ, నబీబియా.

మరింత సమాచారం తెలుసుకోండి: