ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన ఆట తీరుతోనే కాదు ఇక తన సోషల్ మీడియా రీల్స్ తో కూడా అటు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ బాగా దగ్గరయ్యాడు వార్నర్. మరి ముఖ్యంగా దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఇక ఇండియన్ హీరోల సినిమాల పాటలపై రీల్స్ చేసి భారత క్రికెట్ ప్రేక్షకులను అలరించారు. ఇక ఐపీఎల్ లో ఆడటం ద్వారా తన ఆటతో కూడా ఇండియన్ క్రికెట్ ప్రేక్షకుల హృదయాలకు కూడా దగ్గరయ్యాడు వార్నర్.


 అయితే వార్నర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు అనే విషయం తెలిసిందే. తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు.. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులకు  ఎప్పుడు పంచుకుంటూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎంతో కూల్ గా సమాధానాలు చెబుతూ ఉంటాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు అహంకారం ఎక్కువ అంటూ ఇటీవలే ఒక నెటిజన్ సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ ను ట్యాగ్ చేసి మరి ఒక కామెంట్ చేశాడు. అయితే ఇలాంటి కామెంట్ కు ఎవరైనా సరే కాస్త ఆగ్రహంతో ఊగిపోయి.. కౌంటర్ ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఎంతో కూల్ గా సదరు నెటిజన్ కి సమాధానం ఇస్తూనే కౌంటర్ ఇచ్చాడు  ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ముందే అహంకారం ఎక్కువ.. ఇక ఈ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ అహంకారం మరింత ఎక్కువైంది అంటూ వార్నర్ ని ట్యాగ్ చేస్తూ ఒక నేటిజన్ కామెంట్ చేశాడు  అయితే దీనికి కూల్ గా రిప్లై ఇచ్చాడు డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఎవరినైనా కలిశావా లేకపోతే ఊరికే కీబోర్డు మీద టైప్ చేసావా అని స్మార్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: