
ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. కాగా వరుసగా రెండు మ్యాచ్లను విజయం సాధించిన టీమిండియా.. మూడో మ్యాచ్లో మాత్రం ఓడిపోయింది. ఇక ఆ తర్వాత మిగిలిన మరో రెండు మ్యాచ్ లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. దీంతో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకోవడం గమనార్హం. అయితే ఇటీవల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన టి20 మ్యాచ్ గురించి ఆస్ట్రేలియా వ్యాఖ్యాత హెడెన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.
ఈ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో అర్షధీప్ బోలింగ్ చేశాడు. ఈ క్రమంలోనే అతను వేసిన బౌన్సర్ నూ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. ఇక అదే ఓవర్లో బ్యాట్స్మెన్ స్ట్రైట్ గా కొట్టిన బంతి మరో అంపైర్ కు తగిలి అక్కడే ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా వ్యాఖ్యత హెడెన్ ఎంపైర్లు రెండోసారి అంపైర్ తన పని పూర్తి చేశారు అంటూ కామెంట్ చేశాడు. ఇద్దరు అంపైర్లు కలిసిమెలిసి పనిచేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాఖ్యాతగా ఉండి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ అందరూ అతనిపై విమర్శలు చేస్తున్నారు.