ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ మూవీ గురించి. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధమయింది అన్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి అన్న విషయాన్ని మాటల్లో కూడా చెప్పలేం. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ అయితే ప్రేక్షకులందరిలో ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది.


 ఇక ఈ మూవీలో ప్రభాస్ పాత్రను డిజైన్ చేసిన విధానం.. ఇక ప్రభాస్ డైలాగ్స్ అన్నీ కూడా అభిమానులను ఫిదా చేసేసాయి అని చెప్పాలి. ఇక సలార్ మూవీతో ప్రభాస్ అభిమానులందరూ కూడా పండగ చేసుకోబోతున్నారు అని సినీ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు అని చెప్పాలి. కాగా సలార్ మూవీలో ప్రభాస్ దేవా అనే క్యారెక్టర్ ను పోషిస్తున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ కోసం ఏదైనా చేసే వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ మూవీలో దేవా అనే పాత్రతో పాటు సలార్ అనే రెండు పాత్రల్లో కూడా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 అందుకే ముందుగా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు సలార్ గెటప్ ఒకలా ఉంటే.. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ లో దేవా అనే పాత్ర గెటప్ మరోలా ఉంది. ఇక ఈ రెండు క్యారెక్టర్ లని అబ్జర్వ్ చేస్తే ఈ విషయం క్లియర్ గా తెలుస్తుంది అని చెప్పాలి. అయితే ఇలా సలార్ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం ఉండబోతుంది అన్న విషయాన్ని ఇక అభిమానులందరికీ కూడా ఈ చిన్న తేడా చూపించి ప్రశాంత్ నిల్ హింట్ ఇచ్చేశాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోతుంది. అయితే ఇలా ప్రభాస్ ద్విపాత్రాభినయం అని తెలియడంతో ఫాన్స్ అందరు కూడా మరింత సంబరపడిపోతున్నారు. ఇక ఈసారి ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని తెగ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: