ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది అంటే చాలు హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రకంగా చెప్పాలంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా క్రికెట్ పండుగ మొదలవుతూ ఉంటుంది. దాదాపు నెలన్నర పాటు ఐపీఎల్ టోర్నీలోని ప్రతి మ్యాచ్ వీక్షిస్తూ తెగ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు ప్రేక్షకులు. అయితే 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ కు సంబంధించి ప్రస్తుతం హడావిడి మొదలైంది అని చెప్పాలి. ఇక అన్ని టీమ్స్ కూడా ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాయి.



 అయితే ఇక డిసెంబర్ 19వ తేదీన 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ జరగబోతుంది. అయితే అంతకు ముందుగానే ఐపీఎల్ ట్రేడింగ్ లో భాగంగా ఎన్నో టీమ్స్ తమకు కావాల్సిన ఆటగాడిని ఇతర టీమ్స్ నుంచి ట్రేడింగ్ చేసుకుంటూ ఉండటం కూడా జరుగుతూ ఉంది. ఇక మరికొన్ని జట్లు 2024 లో ఎట్టి పరిస్థితుల్లో టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్ల విషయంలోనే కాదు ఇక జట్టు సిబ్బంది విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి టైటిల్ రేసులో ఉన్నప్పటికీ తీవ్రంగా నిరాశ పరుస్తున్న పంజాబ్ కింగ్స్ జట్టు.. ఇక 2024లో ఐపీఎల్ కోసం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ అయిన సంజయ్ బంగర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. 2024 ఐపీఎల్ సీజన్లో హెడ్ కోచ్ ట్రవర్ బ్రెవిస్ తో కలిసి ఇక సంజయ్ బంగర్ పనిచేయబోతున్నారు అని చెప్పాలి. కాగా సంజయ్ బంగర్ గతంలో పంజాబ్ ఫ్రాంచైజీకి సేవలు అందించారు. 2014 సీజన్ లో అసిస్టెంట్ కోచ్ గా 2017, 2016 సీజన్లో హెడ్ కోచ్గా వ్యవహరించారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: