అయితే గత కొంతకాలం నుంచి టైటిల్ రేసులో వెనుకబడిపోయిన టీమ్స్ ఇక జట్టులో ఉన్న ఆటగాళ్లతో పాటు ఏకంగా జట్టుకు ముందుకు నడిపించే కెప్టెన్స్ విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్లో కొన్ని టీమ్స్ కి కొత్త కెప్టెన్లు బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే ఇక 2024 ఐపిఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కూడా కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. అతను ఎవరో కాదు శ్రేయస్ అయ్యర్. అయితే వాస్తవానికి శ్రేయస్ కోల్కతా జట్టుకి పాత కెప్టెనే. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ అతనే సారథ్యం వహించాల్సి ఉంది.
కానీ గాయం కారణంగా అతను ఐపిఎల్ టోర్నీకి మొత్తం దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతనికి డిప్యూటీగా ఉన్న నితీష్ రానా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ జట్టు ఫ్రాంచైజీ. ఇక వైస్ కెప్టెన్గా నితీష్ రానాని ఎంపిక చేసింది. ఇకపోతే గత కొంతకాలం నుంచి అయ్యర్ ఎలాంటి ఫామ్ లో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ లోను ఇదే ఫామ్ కొనసాగిస్తే కోల్కతాకు తిరుగు ఉండదు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి