వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో భాగంగా ప్రస్తుతం అన్ని టీమ్స్ కూడా వరుసగా టెస్ట్ సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత దయాతి దేశమైన పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురయింది అని చెప్పాలి. 471 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 89 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 360 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.



 ఈ క్రమంలోనే చెత్త ప్రదర్శన చేసి ఘోర పరాభవాన్ని చవిచూసిన పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే మాజీ ప్లేయర్ వాన్ సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ జట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కంగారులను సొంత గడ్డపై కంగారు పెట్టించాలి అంటే అది కేవలం ఒక టీమిండియా కు మాత్రమే సాధ్యమవుతుంది అంటూ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మెరుగ్గా రాణించగలరు. 500 వికెట్ల క్లబ్ లో చేరినందుకు నాథన్ లియోన్ కి శుభాకాంక్షలు.


 ప్రస్తుత పరిస్థితుల దృశ్య ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డమీద ఓడించాలి అంటే అది కేవలం టీమిండియా కు మాత్రమే సాధ్యమవుతుంది అంటూ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడు.  అయితే వాన్ చెప్పినట్లుగానే గడిచిన కొన్నేళ్లలో ఆస్ట్రేలియాకు వారి సొంత గడ్డం మీదే చుక్కలు చూపించిన ఘనత అటు భారత జట్టుకు ఉంది అని చెప్పాలి. ఏకంగా వరుసగా రెండుసార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది టీం ఇండియా. 2018 - 19 లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినప్పుడు నాలుగు టెస్టులు ఆడి 2-1 సిరీస్ కైవసం చేసుకుంది. 2020-21 సీజన్ లోను  ఇదే సీన్ రిపీట్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: