అయితే ఇలా టి20 ఫార్మాట్కు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటుంది బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఒక రకంగా చెప్పాలంటే అంతర్జాతీయ టి20 లకు ఎక్కువ ప్రేక్షకాదరణ పెరగడానికి అటు ఐపీఎల్ కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఐపీఎల్ లో బ్యాట్స్మెన్ల బ్యాటింగ్ విధ్వంసం తగ్గించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఒక కొత్త రూల్ ని వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ప్రవేశ పెట్టబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇండియాలో 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే.
ఇక ఇటీవలే అందరూ ఎదురుచూస్తున్న మినీ వేలం ప్రక్రియ కూడా ముగిసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ ప్లేయర్లు రికార్డు స్థాయి ధర పలికారు అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్లో అటు బిసిసిఐ కొత్త రూల్ తీసుకురాబోతుంది అన్నది తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఒక ఓవర్లో బౌలర్ కేవలం ఒకే ఒక బౌన్సర్ వేసేందుకు అవకాశం ఉంటుంది. రెండో బౌన్సర్ వేశాడు అంటే ఏకంగా ఎంపైర్ నో బాల్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక నుంచి ఒకే ఓవర్లో బౌలర్ ఏకంగా రెండు బౌన్సర్లు వేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి కొత్త రూల్ అమలులోకి వస్తుందట అయితే ఇప్పటికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ఈ రూల్ పరీక్షించారు. కాగా బిసిసిఐ నిర్ణయం పై బౌలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి