ఇటీవలే ఐపీఎల్లో స్ట్రాంగ్ టీమ్ గా పేరు సంపాదించుకున్న ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయం పై ప్రస్తుతం రోహిత్ శర్మ అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఏకంగా సారథిగా కొనసాగుతున్న రోహిత్ శర్మను తప్పించి కెప్టెన్సీ బాధ్యతలను హార్థిక్ పాండ్యాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జట్టు యాజమాన్యం. అయితే రోహిత్ లాంటి సక్సెస్ఫుల్ కెప్టెన్ కావాలని అన్ని టీమ్స్ కోరుకుంటుంటే.. అటు ముంబై మాత్రం ఇలాంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.


 ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ అందించి ముంబై జట్టును ఛాంపియన్గా నిలిపిన రోహిత్ శర్మకు.. ఆ జట్టు యాజమాన్యం కనీస గౌరవాన్ని ఇవ్వలేదు అంటూ రోహిత్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో జట్టు యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది ఇకనుంచి ముంబైకి మద్దతు తెలుపబోము అంటూ సోషల్ మీడియా ఖాతాలను అన్ ఫాలో చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాము అన్న విషయం తెలిసిందే. ఇక రోహిత్ కూడా ముంబై జట్టు నుంచి పక్కకు తప్పుకుంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో ముంబై జట్టు గ్లోబల్ హెడ్ కోచ్ మహేళ జయవర్తనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 మేం అభిమానుల ఎమోషన్స్ ను గౌరవిస్తున్నాం. రోహిత్ టీమ్ లో లేదా బయట నుండి భవిష్యత్తు తరాలకు గైడెన్స్ ఇవ్వడం మాకు ఎంతో ముఖ్యం. రోహిత్ వ్యక్తిత్వం అద్భుతం. ఆయన ఒక గొప్ప నాయకుడు అంటూ  జయవర్ధనే కామెంట్ చేశాడు. ఇప్పటికైనా కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం ఆపాలి అంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి రిక్వెస్ట్ చేశాడు జయవర్ధనే. అయితే ముంబై ఇండియన్స్ ఎన్నిసార్లు ఇలాంటి వివరణలు ఇచ్చిన రోహిత్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు కాంప్రమైస్ కావడం లేదు. గొప్ప కెప్టెన్ అంటున్నారు మరి అలాంటప్పుడు రోహిత్ ను ఎందుకు తప్పించారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: