టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో లెజెండరీ కెప్టెన్ గా గుర్తింపును సంపాదించుకున్న ధోని అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా అదే రీతిలో ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్పాలి. వరల్డ్ క్రికెట్లో ఎలా అయితే కెప్టెన్ గా సక్సెస్ అయ్యాడో.. ఐపీఎల్ లోను సూపర్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. తాను సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఏకంగా ఐదు సార్లు టైటిల్ అందించాడు అని చెప్పాలి.



 కేవలం టైటిల్ అందించడమే కాదు ఐపీఎల్ హిస్టరీలోనే ఏ టీం కి సాధ్యం కాని రీతిలో ఎక్కువ సార్లు ఫైనల్ కు చేరుకోవడం.. ఇక ఎక్కువసార్లు సెమీఫైనల్ లో ఆడటం లాంటి రికార్డులు కూడా అటు చెన్నై సూపర్ కింగ్స్ పేరిటే ఉన్నాయి. దీన్ని బట్టి ఇక ధోని జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ధోని ఐపిఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ ప్రతి సీజన్ కి ముందు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో ధోని వారసుడు అంటూ జడేజాకు కెప్టెన్సీ  బాధ్యతలను అప్పగించి చెన్నై జట్టు యాజమాన్యం చేతులు కాల్చుకుంది.


 ఈ క్రమంలోనే చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే ధోని వారసుడు కోసం అటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ ధోని వారసుడి కోసం  వెతుకుతున్నాం అంటూ చెప్పుకోచాడు. అయితే మిస్టర్ కూల్ ప్రతి ఏడాది అత్యుత్తమంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అంటూ ప్రశంసించాడు. ధోనిలో ఉత్సాహం ఆటపట్ల అభిరుచి ఏమాత్రం తగ్గలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సీఎస్కే జట్టు ఇటీవల వేలంలో డారిల్ మిచెల్ ను సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: