అయితే అటు హార్దిక్ పాండ్యా 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభ సమయానికి అందుబాటులోకి వస్తాడా లేదా అనే విషయంపై మాత్రం అనుమానాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం బారిన పడ్డాడు హార్దిక్ పాండ్య. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఇక వరల్డ్ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి మాత్రమే కాదు ఇక ప్రపంచక ముగిసిన తర్వాత భారత జట్టు ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లకి కూడా అతను అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు హార్దిక్ పాండ్యా.
దీంతో ఇక 2024 ఐపీఎల్ సీజన్ నాటికి అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇక ఐపీఎల్ ప్రారంభం నాటికి అతను ఫిట్ గా ఉంటాడని తెలుస్తుంది. కాలి గాయం నుంచి హార్దిక్ పాండ్యా వేగంగా కోలుకుంటున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్ 2024 సీజన్ మార్చి నెలలో ప్రారంభం కానుంది. ఇక అప్పుడు వరకు హార్దిక్ పాండ్య పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడట. హార్దిక్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోతున్నారు. కెప్టెన్గా అతను ముంబై ఇండియన్స్ ని ఎలా ముందుకు నడిపిస్తాడో చూడాలని ఉంది అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి