బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు భారత క్రికెట్ నియంత్రణ మండలికి బాగా డబ్బులు తెచ్చిపెడుతుంది అని మాత్రమే అందరికీ తెలుసు. అదే ఐపీఎల్ టోర్ని ఇక ఎంతోమంది యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తుంది. క్రికెట్ కెరియర్ను మరింత మెరుగైన ప్రమాణాలతో కొనసాగించేందుకు ఆర్థికంగా భరోసాని ఇస్తుంది  అంతేకాదు ఇక తమ ప్రతిభ ఏంటో నిరూపించుకుని అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అంతర్జాతీయ క్రికెట్లో అప్పటికే క్లిక్ అయిన స్టార్ క్రికెటర్ల కంటే అప్పుడప్పుడే క్రికెట్లో రాణిస్తున్న కుర్రాళ్ళకే అటు ఐపీఎల్ టోర్ని బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి.


 అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకొని వారితో కలిసి ఆడుతూ ఇక కుర్రాళ్ళు తమ ఆటను మరింత మెరుగుపరుచుకునేందుకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉపయోగపడుతుంది అని చెప్పాలి. అయితే 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇటీవలే మినీ వేలం జరగగా ఎంతో మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లు భారీ ధర పలికారు. అయితే ఒకవేళ బిసిసిఐ ఐపీఎల్ అనే టోర్నీ ప్రారంభించకపోయి ఉంటే ఎలా ఉండేది అనే ఊహ కూడా ఎంతో మంది యువ ఆటగాళ్ళను భయపెడుతుంది అనడంలో సందేహం లేదు


 అయితే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కూడా ఇటీవల ఇలాంటి ప్రశ్న ఎదురైంది. ఒకవేళ బిసిసిఐ ఐపీఎల్ ప్రారంభించక పోతే ఏం జరిగేది అంటూ ప్రశ్నించగా.. అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి ఉండేది కాదు అంటూ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్ ప్రవేశపెట్టి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేది అంటూ ప్రశ్నిస్తే బీసీసీఐ గనుక అలా చేసి ఉంటే అంతకంటే చెత్త నిర్ణయం మరొకటి  ఉండేది కాదు అంటూ బదులిచ్చాడు. అయితే గౌతమ్ గంభిర్  కూడా ఐపీఎల్ లో కోల్కతా జట్టుకు  రెండుసార్లు ట్రోఫీ గెలిపించిన కెప్టెన్గా కొనసాగుతున్నడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: