ప్రేక్షకులు అందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటూ అటు ఆ బీసీసీఐ ఐపీఎల్ లో ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకు వస్తూఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో లేని రూల్స్ సైతం అటు ఐపిఎల్ లో కనిపిస్తూ ఉంటాయ్. ఇలాంటి నిబంధనల్లో ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో ప్రవేశపెట్టింది బీసీసీఐ. ఈ రూల్ ప్రకారం ఇక మ్యాచ్ లో తలబడుతున్న రెండు టీమ్స్ కూడా మ్యాచ్ మధ్యలో ఇక తమ టీం లోని ఒక ఆటగాడిని డగౌట్ లో ఉన్న మరో ఆటగాడితో స్వాప్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


 ఇలా సబ్ స్టిట్యూట్ ప్లేయర్ తరహాలో జట్టులోకి వచ్చే ఆటగాడు బౌలింగ్ బ్యాటింగ్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ రూల్ ని అన్ని టీమ్స్ కూడా బాగా ఉపయోగించుకుంటూ ఉన్నాయి. స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని బరీలోకి దింపడం ఇక అతని బ్యాటింగ్ పూర్తయిన వెంటనే అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ ద్వారా డగవుట్ లోకి పంపించి.. ఒక కొత్త బౌలర్ ని జట్టులోకి చేర్చుకోవడం చేస్తూ ఉన్నాయి. ఇలాంటి రూల్  జట్టు విజయాలకు తోడ్పడుతుంది. కానీ బౌలింగ్ ఆల్రౌండర్లా కెరియర్ను మాత్రం దెబ్బ తీస్తుంది అంటూ ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గురించి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కి తాను పూర్తిగా వ్యతిరేకం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రోహిత్.. సాధారణంగా క్రికెట్ ను 11 మందితోనే ఆడతారు. కానీ 12 మందితో కాదు. అయితే ఆటలో మరింత వినోదం ఉండేలా ఇక ఈ రూల్ను తీసుకువచ్చారు  కానీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా వాషింగ్టన్ సుందర్, శివం దూబే లాంటి బౌలింగ్ ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుంది. ఇక కేవలం వారిని బ్యాటింగ్ కి మాత్రమే వినియోగించుకుంటున్నారు.  వారిని ఇది ఒక రకంగా వెనక్కి లాగడమే. ఇది టీమిండియా కు ఏ మాత్రం మంచిది కాదు అంటూ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: