
రొనాల్డో ఆదాయంలో సింహభాగం ఫుట్‌బాల్ ద్వారా వచ్చే జీతమే అయినా, మైదానం బయట సంపాదించేది కూడా తక్కువేం కాదు. ప్రస్తుతం అతను సౌదీ ప్రో లీగ్‌లోని అల్ నాసర్ క్లబ్‌కు ఆడుతున్నాడు. సౌదీ అరేబియాకు మారడంతో అతని జీతం రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇప్పుడు ఏడాదికి 200 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.1,712 కోట్లు) జీతంగా అందుకుంటున్నట్లు టాక్. అయితే, ఫుట్‌బాల్ ఆటకు బయట అతను సంపాదించే మొత్తమే అతన్ని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ప్రపంచవ్యాప్త బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, తన సొంత CR7 బ్రాండ్ (CR7 హోటళ్లు, జిమ్‌లు, పెర్ఫ్యూమ్‌లు వంటివి), అనేక ఇతర వ్యాపారాల ద్వారా రొనాల్డో కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నాడు. 40 ఏళ్ల వయసులోనూ, అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను మరియు బ్రాండ్లను అయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉన్నాడు. అతని కమర్షియల్ పవర్‌కు తిరుగులేదని చెప్పాలి!
ఫోర్బ్స్ జాబితాలో ఇతర టాప్ సంపాదనపరులను చూస్తే, బాస్కెట్‌బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ రూ.1,333 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత టైసన్ ఫ్యూరీ (రూ.1,248 కోట్లు), డాక్ ప్రెస్కాట్ (రూ. 1,172 కోట్లు), లియోనెల్ మెస్సీ (రూ.1,155 కోట్లు) వరుసగా ఉన్నారు.
రొనాల్డో ఎంత తేడాతో అందరికంటే ముందున్నాడో చూస్తే లెబ్రాన్ జేమ్స్ రూ. 1,117 కోట్లు సంపాదించాడు. ఇది రొనాల్డో మొత్తం ఆదాయంలో సగం కన్నా తక్కువే. అంతేకాదు, టాప్ 50 అథ్లెట్ల జాబితాలో చోటుదక్కించుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ సంపాదన అవసరమని ఫోర్బ్స్ వెల్లడించింది.
ఈ జాబితాలో చివరిస్థానంలో ఉన్న వ్యక్తి కూడా రూ.436 కోట్లు సంపాదించాడు, ఇది రొనాల్డో మొత్తం ఆదాయంలో సగం కన్నా తక్కువే. అంతేకాదు, టాప్50 అథ్లెట్ల జాబితాలో చోటుదక్కించుకోవడానికి ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ సంపాదన అవసరమని ఫోర్బ్స్ వెల్లడించింది.