
దీంతో షాహిద్ ఆఫ్రిద్ యూట్యూబ్ ఛానల్ పైన ఇండియాలో నిషేధం విధించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మంచి విజయాన్ని అందుకుందంటూ పాకిస్తాన్లో విజయకేతం ఎగరవేస్తూ ర్యాలీ కూడా నిర్వహించారు. దీంతో భారతీయులతో పాటు చాలామంది తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. తాజాగా ఆఫ్రికా చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. పాకిస్తాన్ దేశంలోని ప్రముఖ నగరమైన కరాచీలో ఖననం చేశారంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది. అతని అనుచరులు, విజన్ గ్రూప్ చైర్మన్, ఇతరత్రా అధికారులు షాహిద్ కు సంతాపం తెలిపారంటూ ఈ వీడియోలో తెలియజేశారు.
అయితే ఈ వీడియో వ్యవహారంపై దర్యాప్తు జరగా సంచలన విషయాలు బయటపడ్డాయట.. ఎందుకంటే ఆఫ్రిద్ మరణించలేదని అతడు ఆరోగ్యంగా ఉన్నారని తన కుటుంబంతో కలిసి ఉన్నారని యూట్యూబ్ ఛానల్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారంటూ తెలియజేశారు. ఆఫ్రిద్ మరణించారని చెబుతున్న వార్త కేవలం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ తో రూపొందించారని బయటపడిందట. అయితే ఆఫ్రికా అంటే పడని కొంతమంది వ్యక్తులు ఇలాంటి వీడియోని రూపొందించి వైరల్ చేస్తున్నారని పాకిస్తాన్ అధికారులు తెలియజేస్తున్నారు. 2017లో క్రికెట్ నుంచి తప్పుకున్నాడు అప్పటినుంచి పాకిస్తాన్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతమైతే ఆఫ్రీద్ మరణ వార్త ఫేక్ అని బయటపడింది.