ఆ సందర్భంలో హంరాజ్‌ను కలుసుకోవడం ఒక యాదృచ్ఛికం. కానీ ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు అది జీవిత బంధంగా మారబోతోంది. సోషల్ మీడియాలో వీరి కెమిస్ట్రీ చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. “భారత్ తరఫున ఆడాలని ఉంది” – అమండా మనసులోని మాట .. ఎంగేజ్‌మెంట్ తర్వాత అమండా వెల్లింగ్టన్ చేసిన వ్యాఖ్యలు భారత అభిమానుల్లో పెద్ద ఎమోషన్ క్రియేట్ చేశాయి. “వివాహం తర్వాత నాకు భారత పౌరసత్వం లభిస్తే, నేను టీమ్ ఇండియా తరఫున ఆడాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాను” అని ఆమె చెప్పడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో మ్యాచ్‌ల్లో రాణించిన ఈ లెగ్ స్పిన్నర్ తన ప్రతిభతో బ్యాటర్లను బురిడీ కొట్టించడంలో నిపుణురాలు.
అమండా కెరీర్ హైలెట్స్.. అమండా వెల్లింగ్టన్ ఆస్ట్రేలియా తరఫున పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడింది. ఆమె ప్రదర్శనకు ఎప్పుడూ స్పిన్ మాంత్రికురాలిగా పేరొచ్చింది. ప్రస్తుతం ఆమె అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున విమెన్స్ బిగ్ బాష్ లీగ్‌లో రాణిస్తోంది. జట్టులో స్థిర స్థానం దక్కకపోయినా, తన ఫామ్‌తో ఎప్పుడూ చర్చల్లో ఉంటోంది. ఇండియా–ఆస్ట్రేలియా అభిమానుల మద్య వంతెనగా మారిన జంట .. అమండా–హంరాజ్ వివాహం, ఆమె భారత క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ, రెండు దేశాల అభిమానులను దగ్గర చేసింది. సోషల్ మీడియాలో “భారత్ తరఫున అమండా బౌలింగ్ చేస్తే అదొక స్పెషల్ మూమెంట్ అవుతుంది” అని కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి