ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సప్ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ లో ఉపయోగిస్తున్నారు.. యూజర్స్ కు అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ ను తీసుకువస్తూనే ఉంది. కాబట్టి ఈ యాప్ కు మరింత ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ఎన్నో రకాల మెసేజ్ యాప్స్ అందుబాటులో ఉన్న వాట్సాప్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. యూజర్లు అవసరాలకు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చి బాగా ఆకట్టుకుంటోంది.


తాజాగా వాట్సప్ మరొక ఇంట్రెస్టింగ్ ఫిచర్ ను సైతం తీసుకువచ్చే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఆ ఫీచర్ ఎడిట్ పేరుతో తీసుకువస్తోంది.. సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ పంపిన తర్వాత అందులో ఏదైనా పొరపాటు ఉంటే వెంటనే ఆ మెసేజ్ ను డిలీట్ చేసి.. తిరిగి మళ్లీ వేరే మెసేజ్ ను పంపిస్తూ ఉంటాము ఇకమీదట అలాంటి సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం గా ఈ సరికొత్త ఫీచర్ను తీసుకురావడం జరుగుతోంది వాట్సాప్ సంస్థ. గత వారం నుంచి టెస్టింగ్ కోసం దీనిని IOS, ఆండ్రాయిడ్ బీటాలలో విడుదల చేయడం జరిగింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.



అయితే ఈ ఎడిట్ ఆప్షన్ ఫీచర్ ఆండ్రాయిడ్ వర్షన్..2.23,10,13 ,IOS వంటి వర్షన్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ కొత్త ఫీచర్ తో అవతలి వారికి పంపించిన మెసేజ్లను 15 నిమిషాలలోపు ఎడిట్ చేసుకుని అవకాశం కల్పిస్తోంది. 15 నిమిషాల వ్యవధిలో ఎన్నిసార్లు అయినా మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలంటే ఎడిట్ చేయాలనుకునే మెసేజ్ పైన క్లిక్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి ఇలా చేసి ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.. ఒకసారి మెసేజ్ ఎడిట్ చేశాక అవతరి వారికి ఎడిట్ అని కూడా మెసేజ్ కింద చూపిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: