తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరించే షో జబర్దస్త్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో ఎంతో మంది కమెడియన్ల ఇండస్ట్రీకి పరిచయం అయిన వారు ఉన్నారు. ఇక అంతే కాకుండా ఎంతో మంది కమెడియన్ లు కూడా వెండితెరకు పరిచయం అయిన వారు ఉన్నారు. ఇలాంటి వారిని జబర్దస్త్ కమెడియన్ అప్పారావు కూడా ఒకరని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో తెలుగులో అప్పారావు అంతగా కనిపించడం లేదు. అయితే జబర్దస్త్ లో తను కనిపించకపోవడానికి కొన్ని కారణాలను తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అప్పారావు మాట్లాడుతూ.. చెప్పుడు మాటలు విని తనను జ*ర్దస్త్ హోల్డ్ లో పెట్టారని, కరోనా సమయంలో కూడా తన వయసు ఎక్కువగా ఉండడంతో కొద్ది రోజులు దూరంగా పెట్టామని తెలియజేశారట. ఆ తరువాత పూర్తిగా హోల్డ్ లో పెట్టడం జరిగింది. హోల్డ్ లో పెట్టడంతో అతను చాలా బాధపడ్డానని  తెలియజేశారు అప్పారావు. ఆ తర్వాత కూడా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ గురించి మాట్లాడు తూ.. భాస్కర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. తనని ఎప్పుడూ కూడా హర్ట్ చేయలేదు అని తెలియజేశారు అప్పారావు.

అంతేకాకుండా బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ప్రస్తుతం ఫైమ రావడంతో బాగా పాపులర్ అయ్యింది అని తెలియజేశారు. అయితే జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు భాస్కర్ కనుక.. అప్పారావు టీవీలో కచ్చితంగా ఉండాలి అని అడిగి ఉంటే.. ఎవరు కాదనే వారిని తెలియజేసింది అప్పారావు. కానీ మిగిలిన లీడర్లు అందరూ.. అప్పారావుని మాకొద్దు మాకొద్దు అని అన్నారట. అయినా కూడా ఏం పర్వాలేదు జబర్దస్త్ కి ఎవరికి రమ్మని పిలవకపోయినా.. పిలిచినప్పుడు నేను వెళ్లే పరిస్థితి లేదని తెలియజేశారు. అప్పారావు కామెడీ స్టార్స్, ఈవెంట్స్ , కొన్ని సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు అప్పారావు. అప్పారావు జబర్దస్త్ వీడడం వెనుక ఇంత కథ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: