బుల్లితరపై ఎంతోమంది యాంకర్స్ తమ టాలెంట్ను చూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎన్నో షో లలో ఎంతోమంది యాంకర్లు కనిపిస్తూ ఉంటారు. మొన్నటివరకు అనసూయ ,రష్మీ, సుమ, వర్షిని, ఉదయభాను, విష్ణు ప్రియ, శ్రీముఖి తదితర యాంకర్లు బుల్లితెర పైన, వెండితెర పైన కనిపిస్తూ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విష్ణు ప్రియ కూడా రీసెంట్ గా ఒరేయ్ పండుగాడు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమా కూడా విడుదలై పర్వాలేదు అనిపించుకుంది.


ఇక హీరోయిన్లకు దీటుగా విరు కూడా పోట్టి బట్టలలో కనిపిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకునేందుకు చాలా ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే పోవే పోరా అనే షో తో బుల్లితెరపై అడుగు పెట్టిన విష్ణు ప్రియ అతి తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అందానికి తగ్గ అందం మాటలతో సోషల్ మీడియాలో చేసే పోస్టుల ద్వారా బాగా పాపులర్ అయింది విష్ణు ప్రియ. ముఖ్యంగా ఈమె చేసే వీడియోలు పోస్టులు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా మరొక రీల్ వీడియోను పోస్ట్ చేసింది వాటి గురించి చూద్దాం.

విష్ణు ప్రియ ఒక వీడియోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది అందులో తన అందాలను మరొకసారి ప్రదర్శించి కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. వైట్ కలర్ టీ షర్టులో జీన్స్ ప్యాంటుల తన అందాలను చూపించేలా డాన్స్ వేస్తూ ఉన్నది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఈ వీడియో చూసిన నెట్ జనరల్ సైతం విష్ణుప్రియలో ఇంత టాలెంట్ ఉందా.. అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. విష్ణు ప్రియ టీనేజ్లో" చెక్ మేట్" అనే సినిమాలో నటించగా ఆ సినిమా కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: