ఈ తరం ఇల్లాలు సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో సూర్య, సంధ్య పాత్రలు అద్భుతంగా ప్రేక్షకులను అలరించాయి. ఇక ఈ సీరియల్ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ సీరియల్ లోని నటీనటులు ఇంకా తెలుగు వాళ్లకు గుర్తుండిపోయారు. దియా ఔర్ బాతి పేరుతో హిందీలో వచ్చిన ఈ సీరియల్ లో తెలుగులో డబ్ చేసి ప్రసారం చేసినప్పటికీ కూడా ఈ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు నెంబర్ వన్ టి ఆర్ పి రేటింగ్ తో దూసుకుపోయింది. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ స్థానంలో జానకి రామా సీరియల్ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈతరం ఇల్లాలు సీరియల్ అంత రేటింగ్ మాత్రం ఈ సీరియల్ కి రావడం లేదు.

ఇకపోతే ఈ సీరియల్ లో సంధ్య పాత్రలో ఎంతో అమాయకంగా .. సాంప్రదాయంగా కనిపించిన అమ్మాయి పేరు దీపికా సింగ్.. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివే అమ్మాయికి విధి చేసిన అన్యాయం.. తల్లిదండ్రులను దూరం చేయడం ఇక అండగా ఉండాల్సిన అన్నయ్య కూడా స్వార్థం కోసం అబద్ధాలు చెప్పి చెల్లికి పెళ్లి చేస్తాడు ఆ భర్త సహాయంతో ఆ అమ్మాయి పోలీస్ అధికారిగా ఎలా మారింది.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఆమె ఎదుర్కొంది అనేది ఈ సీరియల్. ఇకపోతే ఇందులో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన దీపికా సింగ్ 1989 జూలై 26న న్యూఢిల్లీలో జన్మించింది.

నటనపై ఆసక్తి ఉండడంతో 2011లో హిందీలో దియా ఆరు భాతి సీరియల్ లో అవకాశం దక్కించుకొని తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. అదే సమయంలో ఈ తరం ఇల్లాలు సీరియల్ డైరెక్టర్లలో ఒకరైన రోహిత్ రాజ్ తో ప్రేమాయణం నడిపి కుటుంబ సభ్యుల సమక్షంలో 2014 మే 2న వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న దీపికా సింగ్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: