బిగ్ బాస్ సీజన్ 7 ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ప్రేక్షకులు సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుంది అంటూ అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ షో కి హోస్టుగా నాగార్జున వ్యవహరిస్తూ ఉండగా హౌస్ లోకి 16 మంది కంటెస్టెంట్లను తీసుకొస్తున్నారని.. అందులో భాగంగా కపుల్స్ కోటా అంటూ మరుగుజ్జు కోటా అంటూ రెండు రకాల కోటాలను కూడా అమలు చేస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా గ్లామర్ బ్యూటీలను ఎక్కువగా ఈ షోకే తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదిలా ఉండగా కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మరి వీరు కచ్చితంగా హౌస్ లోకి వస్తారా? లేదా? అన్న నమ్మకం మాత్రం ఇవ్వడం లేదని చెప్పవచ్చు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సీజన్ 7 లో కంటెస్టెంట్ గా టీవీ స్టార్స్ అయినా నవ్య స్వామి , ఐశ్వర్య, ఈటీవీ ప్రభాకర్ , యాంకర్ వర్షిని పాల్గొనబోతున్నట్లు పుకార్లు బాగా షికారు చేశాయి.

అయితే ఇందులో వర్షిణి తప్ప మిగిలిన వారు కంటెస్టెంట్ గా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈ సీజన్లో నరేష్ తో పాటు బుల్లెట్ భాస్కర్ కూడా జబర్దస్త్ నుంచి పార్టిసిపెంట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియాంక జైన్ ,యూట్యూబ్ స్టార్ అనిల్ గీలా , ఆట సందీప్,  సింగర్ మోహన భోగరాజు వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఆగస్టు నెలలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .మరి ఈసారి సెలబ్రిటీలు ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: