ప్రముఖ యూట్యూబర్ గా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యూట్యూబర్ చందూ సాయి.. గత కొద్ది రోజులుగా చందూ సాయి పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.. గతంలో షార్ట్ వీడియోస్ ,వెబ్ సిరీస్ చేస్తూ పలు రకాల వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.. యూత్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా ఉండేటువంటి వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉండేవారు. అయితే సినిమాలలో అవకాశాలు వస్తాయనుకుంటున్న సమయంలో ఈ యూట్యూబర్ పైన చాలా పెద్ద నింద పడింది.


అది కూడా అమ్మాయి విషయంలో చాలా దారుణంగా మోసం చేశారంటూ ఆరోపణలు కూడా వినిపించాయి.. దీంతో అతనిని అరెస్టు చేయడం కూడా జరిగింది.. తన కుటుంబం పైన కూడా కేసు పడడం జరిగింది.. ఇలా ఒక్కసారిగా తన జీవితం తలకిందులు అయ్యేసరికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు యూట్యూబర్ చందూ  ఇదంతా ఇలా ఉండగా తన అరెస్టు పైన మొదటిసారి చందూ  స్పందిస్తూ ఒక విషయాన్ని తెలియజేశారు.. మొదటిసారి అరెస్టు అయిన తర్వాత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరిస్థితిని తెలియజేశారు.తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.. ఈ ప్రోమోలో చందూ   సాయి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. తనపైన ఆరోపణలు విమర్శలు వచ్చాయి..తన కుటుంబం పైన కూడా చాలా ఆరోపణలు వినిపించాయి.. అంటూ చాలా బాధపడ్డారు. తన పైన పెట్టిన కేసులు అన్నీ కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేని కేసులని అసలు ఆ పని చేయవలసిన అవసరం తనకి ఏంటి అంటే తెలిపారు.. తన ఫ్యామిలీని కూడా కలిపి అసలు నిజాలు తెలుసుకోకుండానే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని చాలా ఎమోషనల్ అయ్యారు.. తమ కుటుంబం కట్నం కింద కోట్ల రూపాయలు అడిగిందని తన పైన ఆరోపణలు విమర్శలు నిరూపిస్తే ఉరి శిక్ష కైనా తాము సిద్ధంగానే ఉంటామంటూ తెలిపారు.. ఇవే కాకుండా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు చందు సాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: