తెలుగులో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరు పొందిన వారిలో గీతూ రాయల్ కూడా ఒకరు.. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. చివరికి బిగ్బాస్ హౌస్లో ముప్పు తిప్పలు పడి గీతూ రాయల్ ఎలిమినేట్ కావడం జరిగింది. విన్నర్ అవుతుందనుకున్న గీతూ రాయల్ ఒక్కసారిగా ఎలిమినేట్ కావడంతో పెద్ద షాక్ తగిలిందని కూడా చెప్పవచ్చు. బిగ్బాస్ తెలుగు ఆరో సీజన్ అయిపోయిన ఇప్పటికీ ఆ బాధ నుంచి ఈమె తేరుకోలేక పోతోంది.


బుల్లితెరపై ప్రసారమయ్యేటట్టు అంటే పలు షోలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. వచ్చిన అవకాశాలను కూడా ఏదో ఒక వంకలు చెబుతూ వదిలేస్తూ ఉన్నది గీతూ రాయాలి. ఇటివలె ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమోషనల్ గా మాట్లాడింది.అందులో తాను బిగ్ బాస్ బస్ చేసేటప్పుడు తమ ఇంట్లో చాలా గొడవలు జరిగాయని.. ఆ సమయంలో తన తలని గోడకేసి కొట్టాలనిపించిందని ఎందుకు జీవిస్తున్న చనిపోదాం అనుకుంటున్న సమయంలో టీవీ షోలో పాల్గొని తనపై జోకులు వేస్తూ నవ్వుకున్నానని తెలిపింది.


తాను గంభీరంగా మాట్లాడినప్పటికీ చాలా వీక్ పర్సనని ఎమోషనల్ గా తెలిపింది. బిగ్బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే కానీ విన్నర్ అనుకున్నాను కానీ ఆరువారాలకు ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న జనాల్ని చూశాక విన్నర్ అవ్వలేనని అర్థమయిందని అందుకే రీ ఎంట్రీ ఆఫర్ వచ్చినా కూడా వెళ్లాలనిపించలేదని తెలిపింది. అయితే మనిషి ఆరోగ్యానికి హానికరమైనటువంటి సిగరెట్లను సైతం తాను దాచినందుకు షో నుంచి బయటికి వచ్చేసానని అయితే ఆ విషయం తనకి తెలిసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని తెలిపింది. ఇవే కాకుండా ఎన్నో చోట్ల జనాలు తనని నెగిటివ్ గానే చేస్తున్నారని. తన భర్త వికాస్ తో తాను కలిసే ఉన్నప్పటికీ తన భర్తకు తనకు మధ్య గొడవలు జరిగాయని రూమర్స్ కూడా సృష్టించారని తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి: