
అయితే తాజాగా ఈ విషయం పైన బిగ్ బాస్ సన్నిహిత వర్గాల నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. హొస్టుగా బాలయ్య వస్తున్నారని విషయంలో ఏ మాత్రం నిజం లేదట.. నాగార్జున బిగ్ బాస్ 9 వ సీజన్ కి కూడా హొస్టుగా చేస్తున్నట్లు తెలియజేశారు.. అందుకు సంబంధించి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా పూర్తి అయ్యిందని నాగార్జున అడిగినంత రెమ్యూనరేషన్ కూడా షో నిర్వాహకులు ఇచ్చారనే విధంగా తెలియజేస్తున్నారు. దీంతో హోస్ట్ ఎవరనే విషయం పైన ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది.
బాలకృష్ణ అన్స్టాపబుల్ షో కి హోస్ట్గా వ్యవహరించినప్పటి నుంచి బాగానే పేరు సంపాదించారు. అందుకే నాగార్జున ప్లేస్ లో బాలయ్యను తీసుకుంటారనే విధంగా వినిపించాయి. అంతేకాకుండా నాగార్జున సినిమాలలో బిజీగా ఉండడం చేత ఈసారి బిగ్ బాస్ హోస్ట్ చేయలేరని వినిపించాయి. ప్రతి సీజన్ ని కూడా కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ షో ఈసారి కూడా కొత్తగా రాబోతున్నదట. ముఖ్యంగా ఈసారి కంటెస్టెంట్ లో విషయంలో కూడా చాలా పాపులారిటీ ఉండే వారిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా సీరియల్స్ నటులను జబర్దస్త్ కమెడియన్లను సోషల్ మీడియా ద్వారా పాపులర్ కి సంపాదించిన వారిని తీసుకోబోతున్నట్లు సమాచారం.