కొన్ని సందర్భాల్లో మనిషికి రెక్కలు ఉంటే బాగుండు అని చాలా మంది అనుకుంటారు. రానున్న రోజుల్లో వారి కలలు నిజం కానున్నాయి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. తాజాగా ఫ్లైయింగ్ కార్ల కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి  అనుకుంటూనే ఉన్నారు. అంతేకాదు వారు ఫ్లైయింగ్ కార్లపై ప్రయోగాలను కూడా మొదలు పెట్టారు. అయితే తొలిసారిగా జపాన్‌లో కూడా ఈ కల సాకారమైంది.

అంతేకాదు స్కైడ్రైవ్, కార్టివేటర్ 2020 రిలీజ్ చేసిన ఫొటోల్లో టెస్టింగ్ ప్లైయింగ్ కారులో ఓ వ్యక్తి ప్రయాణం చేస్తున్నట్లు కనిపించాడు. ఇక జపాన్‌లోని టయోటా టెస్ట్ ఫీల్డ్‌లో ఈ కారును టెస్ట్ చేశారు. జపాన్‌కి చెందిన స్కైడ్రైవ్ కంపెనీ ఈ కారును తయారు చేసింది. విజయవంతంగా ఓ వ్యక్తితో సహా కారును గాల్లోకి ఎగరేసి చూపించారు.

ఏ విమానంలోనో కాకుండా స్వయంగా సొంతకారులోనే అలా ఎగురుతూ వెళ్లిపోతే ఆ థ్రిల్లే వేరు. ట్రాఫిక్ సమస్యలూ ఉండవు. గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఎంతో బరువుండే కారును గాల్లోకి లేపి దూసుకెళ్లేలా చేయడమన్నది దశాబ్దాలుగా ఓ కలలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 ప్రాజెక్టులు ఇలాంటివి ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే మనిషితో సహా గాల్లోకి కారును ఎగరేసి చూపించాయి. దుబాయ్‌లో డ్రోన్ కార్ల కాన్సెప్ట్ ఉంది. అది కొంతవరకూ విజయం సాధించింది.

అంతేకాక ఈ ప్రయోగంలో కారు 2 మీటర్ల ఎత్తు వరకూ గాల్లోకి లేచి ప్రయాణం చేసింది. ఇక చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలల్లో నాలుగు నిమిషాలపాటూ గాలిలో చెక్కర్లు కొట్టింది. ఈ ఫ్లైయింగ్ ‌కారును ఆ సంస్థ 2023లో మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఈ కార్ల వాడకం సేఫ్‌ అని మేం గ్యారెంటీ ఇవ్వలేం" అని స్కైడ్రైవ్ చీఫ్ టోమోహిరో ఫుకుజావా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కారు 10 నిమిషాలు మాత్రమే గాలిలో ఎగరగలదని తెలిపారు. మరింత మార్పులు చేస్తే 30 నిమిషాలపాటూ గాలిలో ఎగరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: