ప్రముఖ మొబైల్ కంపెనీ జియోనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఇప్పుడు మరో ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.. భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే జియోనీ మ్యాక్స్ ప్రో. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో మార్చి 1వ తేదీన లాంచ్ కానుంది. గత సంవత్సరం 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మనదేశంలో లాంచ్ అయిన జియోనీ మ్యాక్స్‌కు తర్వాత వర్సెన్ గా ఈ కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తున్నారు.



ఫోన్ ను ఫ్లిప్ సేల్స్ ద్వారా విడుదల చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంబంధించిన మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసింది. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యూనిక్ ప్రొడక్ట్‌గా విక్రయించనున్నారు. ఈ ఫోన్ ఫీచర్లను చూస్తే దీని ధర రూ.8 వేలలోపే ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ సామర్థ్యం..ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ పేజీలో పేర్కొన్నారు. 6.52 అంగుళాల వాటర్ డ్రాప్ తరహా డిస్ ప్లేను ఇందులో అందించనున్నారు. 3 జీబి, 32 జిబీ ర్యామ్ స్టోరేజి తో ఈ ఫోన్ లాంఛ్ కానుంది.


ముందు వెర్షన్ అయిన జియోనీ మ్యాక్స్ గతేడాది ఆగస్టులో లాంచ్ అయింది. దీని ధరను రూ.5,999గా నిర్ణయించారు. ఇందులో 6.1 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ ప్రొటెక్షన్ ను ఇందులో అందించారు. ఇందులో ఆక్టాకోర్ యూనిసోక్ 9863ఏ ప్రాసెసర్ ను అందించారు. 2 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. 32 జీబీ స్టోరేజ్ ను అందించారు. ఇక ఇప్పుడు లాంఛ్ కానున్న ఫోన్ కెమెరాను చూస్తే..ధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, మరో డెప్త్ సెన్సార్ ను కూడా ఇందులో అందించారు. ఇక ముందువైపు 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: