ఈ క్రమంలోనే గూగుల్ పే ఫ్లాట్ఫామ్ కూడా తమ యూజర్ల కోసం డిజిటల్ పర్సనల్ పేమెంట్ అని కూడా ఆఫర్ చేస్తోంది.. అంతేకాదు తమ యూజర్లకు ఏకంగా లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ ఆఫర్ చేయడం గమనార్హం. ఇకపోతే ఎవరైనా సరే ఈ డిజిటల్ పర్సనల్ లోన్ ఆఫర్ ను పొందాలి అనుకుంటే గూగుల్ పే యూజర్లు తప్పనిసరిగా క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండాల్సిందే. ఇక క్రెడిట్ స్కోర్ ఆధారంగా గూగుల్ పే తన యూజర్లకు సుమారుగా లక్ష రూపాయల వరకు లోన్ అందించడానికి ముందుకు వచ్చింది.
ఇకపోతే గూగుల్ పే ప్రీ క్వాలిఫైడ్ యూజర్లకు..DMI ఫైనాన్స్ కంపెనీ ద్వారా.. డిజిటల్ పర్సనల్ లోన్స్ ఆఫర్ ను తీసుకు వచ్చింది గూగుల్ పే.. ఇకపోతే ఈ ఆఫర్ పొందాలి అనుకుంటే అర్హత కలిగిన యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ ను పొందే అవకాశం ఉంటుంది.. అది కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే మీరు లక్ష రూపాయల వరకు పర్సనల్ లోన్ పొందే అవకాశాన్ని కల్పించింది గూగుల్ పే.. ఇకపోతే ఈ లోన్ మొత్తాన్ని కేవలం మూడు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లకు గూగుల్ పే అందిస్తున్న ఈ బెనిఫిట్ చాలా ప్రయోజనకరం అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి