ఇటీవల కాలంలో భారత దేశంలో టెలికాం దిగ్గజాలు బాగా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తమ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఎయిర్టెల్ కూడా తాజాగా మరో రెండు ప్లాన్ లను తమ కస్టమర్ల కోసం తీసుకురావడం జరిగింది. ఇక ఈ ఎయిర్టెల్ ప్లాన్ లతో భారీగా డైలీ డేటా ను పొందవచ్చు. మరి ఈ రెండు ప్లాన్ల కు సంబంధించి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఒక సారి చదివి తెలుసుకుందాం..

ఎయిర్టెల్ రూ.699 ప్లాన్:
ఎయిర్టెల్ తాజాగా ₹699 తో ఒక ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 56 రోజుల పాటు ఉంటుంది. ఇక ఈ ప్లాన్ ను  ఎంచుకున్న వినియోగదారులకు ప్రతిరోజు 3 జీబీ డేటా కూడా లభిస్తుంది. మొత్తం 56 రోజులకు గాను 168GB  డేటా ను అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇదే కాకుండా కంపెనీ ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 SMS లని కూడా మీరు ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ.999 ప్లాన్:
ఇక ఎయిర్టెల్ అందిస్తున్న రూ.999 ప్లాన్ సైతం తాజాగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఇక ఇది 84  రోజుల పాటు వ్యాలిడిటీ ఉండగా.. ప్రతి రోజు 2.5 GB డేటా ను ఉచితంగా పొందవచ్చు. ఇక ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ రెండు ప్లాన్ లతోపాటు వినియోగదారులు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ మొబైల్ తో పాటు అపోలో 24/7  సర్కిల్,  ఫ్రీ హలో ట్యూన్స్ ని అలాగే  వింక్ మ్యూజిక్ కూడా ఉచితంగా సభ్యత్వం పొందే అవకాశం కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: