ఒకప్పుడు అంటే క్రెడిట్ కార్డ్స్ అంటే చాలా మందికి తెలియదు.. కానీ ...ఇపుడు క్రెడిట్ కార్డ్స్ వాడకం గణనీయంగా పెరుగుతోంది. పలు బ్యాంకుల వారు కస్టమర్లకు ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డ్స్ తీసుకోమని ఆఫర్ చేస్తుండటంతో అవసరానికి వేరే వారి దగ్గర చెయ్యి చాచడం కన్నా క్రెడిట్ కార్డ్స్ వాడుకోవచ్చు కదా అన్న అభిప్రాయంతో క్రెడిట్ కార్డ్స్ కు అప్లై చేసేసి తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ ఉంది కదా అని డబ్బులు ఉన్నా లేకున్నా కనపడిందల్లా కొనేస్తే చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లు వచ్చాక జేబుకు చిల్లే. ఒకవేళ అపుడు కట్టలేదు అంటే అంతకంతకూ వడ్డీ మరో చిల్లు. అయితే క్రెడిట్ కార్డ్ ని సరిగా వినియోగిస్తే సంతోషంగా, లాభదాయకంగా ఉంటుంది.

షాపింగ్ కు వెళ్ళినా, గ్రాసరీస్ కైనా మరేదైనా సరే చాలామంది తమ క్రెడిట్ కార్డ్స్ తీసి తెగ గీకేస్తున్నారు.  అయితే క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత వరకు ఉంటే అంత వరకు వాడేయకూడదని ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో 30 శాతనికి మించి పెరగకూడదని  వారు అంటున్నారు. అంతకన్నా ఎక్కువ వాడితే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడి వడ్డీ రెట్లు పెరుగుతాయని అంటున్నారు. అంతేకాదు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియను బట్టి సిబిల్ స్కోరు మారుతూ ఉంటుందట. మీరు క్రెడిట్ కార్డు లిమిట్ ను ఎక్కువ వాడుతున్నారంటే ఎక్కువ అప్పులో మునుగుతున్నారు అని అర్దం. అలాంటప్పుడు మీ సిబిల్ స్కోర్ ఎలా పెరుగుతుంది.

అత్యవసర సమయం లోనూ లేదా ఖచ్చితంగా కావాలి అనుకున్న వస్తువులో క్రెడిట్ కార్డ్ వినియోగిస్తూ పొదుపుగా వాడితే క్రెడిట్ కార్డ్స్ లభమైన మార్గమే అంటున్నారు నిపుణులు. అయితే మరికొందరు మాత్రం క్రెడిట్ కార్డ్స్ అంటేనే భయపడుతున్నారు. అది ఉంటే మనకు ఖచ్చితంగా అప్పు ఉన్నట్లే అని అపోహ పడుతూ అసలు క్రెడిట్ కార్డ్స్ వైపే చూడటం లేదు. కానీ వాస్తవానికి క్రెడిట్ కార్డ్స్ వినియోగించినపుడే ఆ డబ్బుకు తగ్గ అప్పు సదరు కంపెనీకి మీరు చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: