ఫేమస్ ఇండియన్ టూ వీలర్ కంపెనీ 'టీవీఎస్ మోటార్' కంపెనీ యొక్క జుపీటర్  ఇండియన్ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న స్కూటర్ జాబితాలో ఒకటి.అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్కూటర్ ని 'క్లాసిక్ ఎడిషన్' లో లాంచ్ చేసింది.ఇండియన్ మార్కెట్లో విడుదలైన 'టీవీఎస్ జుపీటర్ క్లాసిక్' ధర రూ. 85,866 (ఎక్స్-షోరూమ్-ఢిల్లీ). ఇది కేవలం టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇది చూడటానికి మునుపటి మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ, వాటి నుంచి ఇది ప్రత్యేకంగా కనిపించడానికి కొత్త కలర్ ఆప్సన్స్ ఇంకా కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా ఈ కొత్త 'జుపీటర్ క్లాసిక్' కి అట్రాక్షన్ గా నిలుస్తాయి.నిజానికి ఇండియన్ మార్కెట్లో కొత్త టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ విడుదలకావడానికి ప్రధాన కారణం, మార్కెట్లో ఇది 'ఐదు మిలియన్ వాహనాల' మైలురాయిని సాధించడమే. దీన్ని బట్టి చూస్తే ఇండియన్ మార్కెట్లో టీవీఎస్  జుపీటర్ కి ఎంత ఆదరణ ఉందొ స్పష్టంగా తెలుస్తుంది.టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి సిల్వర్ కలర్ ఇంకా పర్పల్ కలర్.


ఈ రెండు కలర్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూటర్ లో ఎన్ని కొత్త అప్డేట్స్ వచ్చినప్పటికీ ఇంజిన్ ఇంకా పనితీరు దాని మునుపటి మోడల్ లాగానే ఉంటుంది.కొత్త టీవీఎస్ జుపీటర్ క్లాసిక్ లో అదే 109.7 సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అలాగే ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 7.8 బిహెచ్‌పి పవర్ ఇంకా 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఎలక్ట్రిక్ స్టార్టర్ ఇంకా కిక్ స్టార్టర్ రెండింటికీ జత చేయబడి ఉంటుంది, కావున ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.ఇందులో మిర్రర్స్ బ్లాక్ ఫినిషింగ్ పొందుతాయి.అయితే దాని మునుపటి మోడల్స్ మాత్రం క్రోమ్‌ ఫినిషింగ్ పొందుతాయి.ముందుభాగంలో 'జుపీటర్' బ్యాడ్జ్ అనేది కింది నుంచి పైకి ఉంటుంది. అంతే కాకూండా ఫ్రంట్ ఆప్రాన్ లో భారతదేశంలో దీని ఘనతను గుర్తుచేసే '5 మిలియన్' బ్యాడ్జ్ కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా దీనిని కొత్తగా చూపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: