ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటివి రెండు జీవితంలో చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి. నిత్యజీవితంలో ఏదో ఒకచోట వీటి అవసరం ఉండనే ఉంటోంది. పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రెండిటిని అనుసంధానం చేయాలని నిర్ణయాన్ని తీసుకుంది అయితే దీని మీద తుది గడువు పెంచుతూనే కనిపిస్తోంది. మార్చి 31వ తేదీ వరకు ఈ గడువును పొడిగించింది. అందుకే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పాన్ కార్డుని రెండిటిని తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నది.


ఒకవేళ చేయని యెడల ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి బ్యాంకు లావాదేవులు తాత్కాలికంగా నిలిపివేస్తారని ఆదాయపన్ను సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. మనదేశంలో జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాలు మినహా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోవాలి కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రెండింటిని లింకు చేసుకోవడం మంచిది.. ఈ ప్రాసెస్ అధికారిక వెబ్సైట్ ఎస్ఎంఎస్ ద్వారా కూడా చేసుకోవచ్చు.


డిపార్ట్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆధార్ పాన్ కార్డు లింక్ అయ్యిందా లేదా అనే విషయాన్ని చేసుకోవచ్చు లేకపోతే రూ .1000 రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. డిపార్ట్మెంట్ వెబ్సైట్ మరొకటి NSDL అనే వెబ్సైట్లో చేసుకోవచ్చు. మొదట ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో ఎలా చేయాలంటే.. HTTPS://WWW.INCOMETAX.GOV.IN/IEC/FOPORTAL / వెబ్సైట్ కి వెళ్ళాలి ఇందులో ఈ పే టాక్స్ పైన క్లిక్ చేయాలి. ఆ కింద పాన్ నెంబర్ను ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది మీ మొబైల్ కి వచ్చి ఓటిపిని తర్వాత వచ్చే పేజీలు ఎంటర్ చేయాలి దీంతో వెరిఫికేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తాది వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి అయితే వీటిలో సంబంధిత బ్యాంకింగ్ ఆప్షన్ లేకపోతే రెండో పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: