ప్రతి ఒక్కరం కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాము. అయితే ఇందులో కొన్ని తెలియని వాటిని కొన్ని సందర్భాలలో తెలుసుకుంటూ ఉంటాము.. అలా ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ఆండ్రాయిడ్ డివైస్లలో స్పేవేర్ ఉంటుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ స్పేవేర్ అంటే ఒక రకమైన మార్వెల్.. ఇది డివైస్ ల పైన దాడి చేయగలదు .ఆ తర్వాత మన మొబైల్ లో ఉండే థర్డ్ యాప్స్ కు సైతం మన డేటాను అందులోకి అందించగలుగుతుందట. స్మార్ట్ మొబైల్ లో స్పేవేర్ యాప్ కూడా చాలా సాధారణంగా యాప్ గాని ఉంటుందని టెక్నిపుణులు తెలుపుతున్నారు.


దీనివల్ల మనల్ని చాలామంది బ్లాక్ మెయిల్, చీటింగ్, ఇతరత్రా డేటా విక్రయించి ఇతర ప్రయోజనాల కోసం మన డేటాను ఉపయోగిస్తూ ఉంటారు.స్పేవేర్ అనేది ఆడియో వీడియో పాస్వర్డ్ వంటి వాటిలలో ఉంటాయట ఇందులో కిలాగర్ లు, కుకింగ్ ట్రాకర్లు, బ్యాంకింగ్ ట్రోజనర్లను రికార్డు చేస్తూ ఉంటాయట. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏదైనా లింకు క్లిక్ చేసినప్పుడు స్పేవేర్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోకి చొరబడి మీ మొబైల్ లో ఉండే సమాచారాన్ని అంత తెలుసుకోవడానికి ఈ స్పేవేర్ ఉపయోగపడుతుందట.


అయితే ఆండ్రాయిడ్ మొబైల్ లో స్పేవేర్ గురించి ఎలా చెక్ చేసుకోవాలి అంటే..స్పేవేర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ పర్ఫామెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది.. మొబైల్ స్లో కావడం వేడెక్కడం బ్యాటరీ చార్జింగ్ వేగంగా తగ్గిపోవడం.. ఇతరత్రా హెడ్డింగ్ యాప్స్ లాంటివి రావడం వంటివి జరుగుతూ ఉంటాయట. అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ మొబైల్ లో స్పేవేర్ యాప్స్ ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యము..

మనం మొబైల్ కి పవర్ ఆఫ్ బటన్ ని అలాగే నొక్కి పట్టుకుంటే.. మనకు ఫేక్ మోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుందట.. అప్పుడే పవర్ బటన్ నొక్కి పట్టుకొని సేఫ్ మోడ్లో సెట్టింగులకు వెళ్లి అక్కడ యాప్ ను చెక్ చేసుకోవాలి . మనం గుర్తించలేని యాప్లు ఉంటె ఆయాపే స్పేవేర్ ఆ తర్వాత ఈ యాప్ ను అన్ఇన్స్టాల్ చేసి మీ ఆండ్రాయిడ్ డివైస్ సైతం రీస్టార్ట్ చేయడం మంచిది. అయితే ఇలాంటివి చెక్ చేసుకునేందుకు..MCAFEE,AVG,NORTON -360 వంటి యాప్స్ లో స్కానింగ్ చేయడం వల్ల కూడా తెలుస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: