వాహనాలు ఉన్నవారు కచ్చితంగా కొన్ని విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.ముఖ్యంగా వాహనం పైన కొన్ని స్టిక్కర్లు కూడా మిర్రర్ మీద అతికించి ఉంటాయి. అందులో HSRP అనే స్టిక్కర్ కూడా ఉందా లేదా అనే విషయాలను చెక్ చేసుకోవాలి ఈ పేరు మొదటిసారి వింటున్నారా ఇది కలర్ కోడ్ స్టిక్కర్ అని కూడా చెప్పవచ్చు. దీనిని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ స్టిక్కర్ ని విండ్ షీల్డ్ పైన అతికించాల్సి ఉంటుంది. ఈ రూల్ను 2019 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేశారు. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను కోర్టు మరింత కఠినంగా నిబంధనలను పాటించమంటూ ఆదేశాలను జారీ చేశారు.



ఈ స్టిక్కర్ వాహనం పైన అతికించకుంటే..PUC సర్టిఫికెట్, అలాగే రిజిస్ట్రేషన్ బదిలీ, డూప్లికేట్ ఆర్ సి ఇతరత్న సేవలు ఉండవని తెలియజేస్తున్నారు అధికారులు. అసలు ఈ స్టిక్కర్ వేటి గురించి తెలియజేస్తుందంటే..HSRP (హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్) వివిధ రంగులలో వచ్చే హూలో గ్రామ్ స్టిక్కర్.. ఇది వాహనానికి ముందు వైపు గాజు పైన అతికించబడి ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆ వాహనం యొక్క ఇంధనం అంటే (డీజిల్, పెట్రోల్, cng,EV) వంటి వాటిని గుర్తించడానికి ప్రధాన ఉద్దేశం గా ఉంటుందట.


ఢిల్లీ వాటి పరిసర ప్రాంతాలలో ఎక్కువగా కాలుష్యం ఉండడంతో  వాటిని తగ్గించడానికి అక్కడ తనిఖీలు మమ్మరంగా చేస్తోంది సుప్రీంకోర్టు. సుప్రీం కోర్ట్ నిబంధనలను పాటించకపోతే జరిమానా కింద రూ .2000 నుంచి 5000 రూపాయల వరకు విధిస్తుందట. అయితే ఈ పద్ధతి ఢిల్లీలో మాత్రమే ఉన్నప్పటికీ ఆ తర్వాత అన్ని రాష్ట్రాలలో కూడా వర్తింప చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఏ వాహనానికి ఏ రంగు స్టిక్కర్ ఉంటుందంటే..
1). మీ వాహనం పెట్రోలు లేదా cng ద్వారా నడిస్తే నీలిరంగు స్టిక్కర్.

2). డీజిల్ వాహనాలకు.. నారింజ రంగు స్టిక్కర్.
3). ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ స్టిక్కర్ అనిపిస్తారు.

4). అలాగే ఇతర వాహనాలకు బూడిద రంగు కలర్ స్టిక్కర్ ని అతికిస్తారు.

ఈ స్టిక్కర్ యొక్క ప్రధాన లక్ష్యం వాహన ఇంధనానికి సంబంధించిన సమాచారాన్ని రంగుల ద్వారా కనుక్కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: