ఎన్నో పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తే ఇక రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. వ్యాయామం కారణంగా అటు ఎలాంటి వ్యాధులు కూడా దరిచెరువు ఇవన్నీ వైద్యులు చెప్పే మాటలు. ఇన్నాళ్లపాటు ఇవన్నీ నిజమే అనుకొని ఎంతోమంది ఇక వైద్యులు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చారు. కానీ ఇటీవల వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మాత్రం పౌష్టికాహారం తీసుకోవడం లేదా ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కాదు ఇక ఉన్న ఒక్క జీవితంలో ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలి అని భావిస్తూ ఉన్నారు.


 అయితే రోడ్డు ప్రమాదాలు కరోనా మరణాలు అనే సంఘటనల గురించి పక్కన పెడితే కేవలం అనారోగ్యం పాలు అయిన వారు మాత్రమే మరణించడం చూసాం. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం క్షణకాల వ్యవధిలో ఎవరు ఊహకందని విధంగా ప్రాణాలు కోల్పోతున్న తీరు ప్రతి ఒక్కరిలో ప్రాణతీపిని మరింత పెంచుతుంది అని చెప్పాలి. అయితే 130 కోట్ల జనాభాలో ఇప్పటివరకు ఇలా క్షణకాలంలో చనిపోయింది పదో పాతికమందే కావచ్చు. కానీ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వీడియోలు తెరమీదకి వచ్చి వైరల్ గా మారిపోవడంతో ఇదే అందరి మనసుల్లో పాతుకుపోయింది.


 అందరిలో ప్రాణ తీపి పెరిగిపోతోంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన మరోసారి వెలుగు చూసింది. మధ్యప్రదేశ్లోని కట్నీ జిల్లాలో ఏకంగా ఒక ఆలయంలో ప్రార్థన చేసేందుకు వెళ్లిన వ్యక్తి అక్కడే మరణించాడు. రాజేష్ మహాని అనే వ్యక్తి మెడికల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే అతను సాయి బాబా భక్తుడు. ఇటీవల సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. ఈ క్రమంలోనే దేవున్ని  దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన పాదాలపై తలపెట్టాడు. అంతే ఇక ఆకలాగే ప్రాణాలను కోల్పోయాడు ఇంతకీ అతను లేకపోవడంతో మిగతా భక్తులు లేపేందుకు ప్రయత్నించగా చివరికి చనిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: